ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మహిళ మెడలోని చెయిన్ లాక్కెళ్లిన దుండగులు
హన్మకొండ నగరంలో చెయిన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. నగరంలోని ఎక్సైజ్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మహిళ మెడలో ఉన్న బంగారు చెయిన్‌ను దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, దుండగుడు వెంటనే బైక్‌పై పరారయ్యాడు.
ఈ ఘటనలో బాధితురాలు మామిండ్ల నవ్య. ఆమె సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.
అయితే నగరంలో వరుసగా చెయిన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతుండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment