దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకున్నట్టు సమాచారం. ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఆయన Dubai వెళ్లారు.
అయితే, దుబాయ్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అన్ని అంతర్జాతీయ మరియు దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలుస్తోంది.
దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సురక్షితంగా ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది.
భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే ఆయన తిరుగు ప్రయాణం ఉండే అవకాశం ఉంది.

Post a Comment