నిద్ర మత్తులో డ్రైవర్… బస్సు బోల్తా – పలువురికి గాయాలు
అనకాపల్లి జిల్లా: నక్కపల్లి సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో సుమారు ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సులో సుమారు 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment