తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
- ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్. చిత్తరంజన్‌ను అదే జిల్లాలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.
- కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్యరెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.
- జనగామ ఏఎస్పీ పందిరి చేతన్ నితిన్‌ను జగిత్యాల ఏఎస్పీగా నియమించారు.
- భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ ఏఎస్పీగా బదిలీ చేశారు.
- వరంగల్ ఏఎస్పీ నగ్రాలె శుభమ్ ప్రకాశ్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీగా నియమించారు.
- భైంసా అదనపు ఎస్పీ రాజేశ్ మీనాను వనపర్తి ఏఎస్పీగా బదిలీ చేశారు.
- ఆదిలాబాద్ ఏఎస్పీ పి. మౌనికను ఆదిలాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.
- నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)గా బదిలీ చేశారు.
- వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయిని ఉట్నూర్ ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)గా నియమించారు.

Post a Comment