చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి.. మేడ్చల్‌లో విషాదం
మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని చెరువులో స్నానానికి వెళ్లిన ఉమన్ (14), ఎస్.కే. ఇర్ఫాన్ (12) ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి గల్లంతయ్యారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బయటకు తీశారు.
అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదే తరహా ఘటనల్లో లోతు తెలియక చెరువుల్లోకి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
మృతుల్లో ఉమన్ మునీరాబాద్‌లోని నాగార్జున హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా, ఇర్ఫాన్ డబిల్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 7వ తరగతి విద్యార్థి.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment