కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నందు పర్యటించిన రక్షణ పక్షోత్సవ కమిటీ
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నందు పర్యటించిన రక్షణ పక్షోత్సవ కమిటీ సభ్యులు
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో రక్షణ పక్షోత్సవ కమిటీ సభ్యులు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు గారు హాజరు కావడమైనది.
ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఆర్. సి. హెచ్. పి నందు పనిచేస్తున్న ఉద్యోగులందరూ (పర్మినెంట్/కాంట్రాక్ట్) వారికి కేటాయించిన పనులను అంకితభావంతో, మరి ముఖ్యంగా రక్షణతో చేస్తున్నారని అలా చేయడం ద్వారానే గత సంవత్సరం రక్షణ పక్షోత్సవ కమిటీ సభ్యులతో సింగరేణి మొత్తంలోని సి.హెచ్.పి నందు మొదటి బహుమతి పొందుకోవడం జరిగిందని తెలియజేశారు. అలాగే ప్లాంట్ చిన్నదైనప్పటికీ నిర్దేశించిన లక్ష్యాలలో సాధించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని, ఉద్యోగులు మరియు అధికారుల మధ్య సమిష్టి కృషి వలన ఇది సాధ్యమవుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరడం జరిగింది.
ఇంచార్జ్ ఆర్.సి.హెచ్.పి కు రక్షణ కమిటీ సభ్యులు అడిగిన విషయాలను సంబంధిత అధికారులతో వివరించి 55వ రక్షణ పక్షోత్సవ కమిటీ సభ్యులతో సింగరేణి ఏరియాలో మన కొత్తగూడెం ఏరియా గత సంవత్సరం మాదిరి మరల మొదటి బహుమతి పొందుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిఎం తో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే. గట్టయ్య, ఐఎన్టీయూసీ ప్రతినిధి శంకర్ బాబు, రక్షణ పక్షోత్సవ కమిటీ కన్వీనర్ ఎం. తిరుమల రావు, కమిటీ సభ్యులు సిహెచ్ గాబ్రేడ్ రాజు, వి. మహేంద్రనాథ్, బి. హనుమాన్ గౌడ్, డి.వెంకటేశ్వర్లు, టి.సతీష్ కుమార్, జి.శ్రీనివాస్, ఇంచార్జ్ ఆర్.సి.హెచ్.పి ఎస్.కే కరిముల్లా, అధికారులు జె.లింగ ఇతర అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.
Post a Comment