-->

ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలుగా నగదు స్వాధీనం

ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలుగా నగదు స్వాధీనం


కటక్: కేవలం రూ.30 వేల లంచం ఆరోపణతో ప్రారంభమైన దర్యాప్తు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసుగా మారింది. Odisha Vigilance అధికారులు నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలుగా నగదు బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. Mines Departmentకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ Debabrata Mohanty రూ.30,000 లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.

సోదాల సమయంలో ప్రతి బ్యాగ్ తెరిచినప్పుడల్లా నోట్ల కట్టలే కనిపించడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్లకు పైగా అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

నగదు లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, మొత్తం మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. విజిలెన్స్ విభాగ చరిత్రలో ఒకే ప్రభుత్వ అధికారి నుంచి ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం కావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం Debabrata Mohantyను అదుపులోకి తీసుకుని, ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, బెనామీ పెట్టుబడులు తదితరాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793