కరీంనగర్‌లో హామీ నిలబెట్టుకున్న కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్
కరీంనగర్; ఫిబ్రవరి 25: కరీంనగర్ కొత్తపల్లిలోని 17వ డివిజన్‌లో కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తన మాట నిలబెట్టుకుని మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, డివిజన్‌కు చెందిన దూస లత–శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహానికి ఆమె స్వయంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన కార్పొరేటర్, తన వంతు సహాయంగా రూ.10,016 నగదును ఆడబిడ్డకు అందజేశారు. పేద కుటుంబానికి అండగా నిలుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యల్లో, శుభకార్యాల్లో భాగస్వామ్యం అవుతూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తీరును పలువురు అభినందిస్తున్నారు.

Post a Comment