-->

స్వర్గీయ మంద జగన్నాధం మాజీ ఎంపికు ఘన నివాళులు

 

స్వర్గీయ మంద జగన్నాధం మాజీ ఎంపికు ఘన నివాళులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వర్గీయ మంద జగన్నాధం మాజీ ఎంపికు ఘన నివాళులు అర్పించిన మంద హనుమంతు, దాసరి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మంద జగన్నాధం కి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన సేవలు ప్రజల జీవితాల్లో సుస్థిరమైన మార్పు తీసుకువచ్చేందుకు ప్రతిబింబంగా నిలిచాయి అన్నారు. ఒక గొప్ప నాయకుడిగా, సామాజిక సేవకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి.

ఈ తరుణంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుని ప్రార్థిస్తునమన్నారు. 

ఈ కార్యక్రమంలో మంద హనుమంతు, దాసరి శ్రీనివాస్, కొత్తపల్లి సోమయ్య, విసంపల్లి కృష్ణ, నల్లగట్ల వెంక్కన్న, చెంగల గురునాధం, దాసరి సారధి, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793