-->

అక్షరం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను TRVKS G S చారుగుండ్ల రమేష్

 

అక్షరం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను TRVKS G S చారుగుండ్ల రమేష్

విద్యుత్ ఉద్యోగులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా TRVKS KTPS ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్షరం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్  ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ, అక్షరం పత్రిక ప్రజలు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఈ పత్రికతో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా TRVKS కోసం మద్దతు అందించాలని కోరారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రమేష్ పిలుపు

రమేష్ విద్యుత్ సంస్థలోని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా మాట్లాడారు:

EPF to GPF మార్పు,

ఆర్టిజన్స్ కన్వర్షన్,

గ్రేడ్ చేంజ్,

సీనియర్ ఫోర్‌మెన్ పోస్టుల మంజూరు,

ఉద్యోగ భారం తగ్గించేందుకు కొత్త పోస్టుల సృష్టి,

ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ప్రభుత్వాలు మరియు విద్యుత్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మరణించిన ఉద్యోగుల వారసుల సమస్యలపై ప్రస్తావన

గత ఆరు నెలల క్రితం జెన్కోలో మరణించిన ఉద్యోగుల వారసుల ఇంటర్వ్యూలలో అర్హులైన వారికి వెంటనే ఉద్యోగాలు మంజూరు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న DAలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు R. శ్రీనివాస్, జన్కో ఉపాధ్యక్షులు D. నాగేశ్వరరావు, అసిస్టెంట్ సెక్రటరీస్ MD అమీన్, SK మల్సూర్, KTPS 7వ దశ రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు దెంచనాల రాంబాబు, ముత్యాల రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ K. రవికుమార్ యాదవ్, N. వెంకటేశ్వర్లు, 5 & 6 దశల రీజనల్ కార్యదర్శి MD సుభాని, ట్రెజరర్ P. విజయశంకర్, YTPS రీజనల్ అధ్యక్షులు M. వీరనారాయణ, N. రవికుమార్, బ్రాంచ్ అధ్యక్షులు పఠాన్ మహ్మద్ ఖాన్, ఆర్టిజన్ నాయకులు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి శుభాకాంక్షలతో విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం సమగ్ర చర్యలు చేపట్టాలనే సంకల్పాన్ని ప్రదర్శించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793