-->

నాలుగేళ్ల చిన్నారిని బలితీసుకున్న పల్లిగింజ విషాదంలో లష్కర్‌గూడ

నాలుగేళ్ల చిన్నారిని బలితీసుకున్న పల్లిగింజ విషాదంలో లష్కర్‌గూడ


రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులైన శ్యామ్ మరియు మహేశ్వరి దంపతుల కుమార్తె తన్విక (4) ఆహారం తింటుండగా ఓ పల్లిగింజ ఆమె ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆ సమయంలో చిన్నారి తీవ్రంగా శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడటం మొదలైంది.

అవస్థపడుతున్న పాపను గమనించిన తల్లిదండ్రులు తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్ చేసి ఆమె ఊపిరితిత్తుల్లో పల్లిగింజ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని భావించినప్పటికీ, అప్పటికే తన్విక పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆమె మరణించింది.

ఈ ఘటన తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. చిన్నారి మరణంతో లష్కర్‌గూడ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇలాంటి ప్రమాదాల నుండి చిన్నారులను రక్షించేందుకు తినే పదార్థాలలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.