-->

హార్ట్ స్ట్రోక్‌తో మరిపెడ ఏఎస్ఐ మూడ్ హనుమంతు నాయక్ మృతి

హార్ట్ స్ట్రోక్‌తో మరిపెడ ఏఎస్ఐ మూడ్ హనుమంతు నాయక్ మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మూడ్ హనుమంతు నాయక్ (వయస్సు 55) హార్ట్ స్ట్రోక్‌తో మృతిచెందారు. ఉదయం 6 గంటల సమయంలో విధుల్లో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడింది. తీవ్రమైన వేడి కారణంగా హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యారని అధికారులు తెలిపారు.

సమయస్పూర్తిగా స్పందించిన సహచరులు ఆయన్ను వెంటనే ఖమ్మంలోని సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన శ్వాస విడిచారు. ఆయన మృతిచెప్పడం పట్ల కుటుంబ సభ్యులు, సహచరులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మృతదేహాన్ని స్వగ్రామమైన మర్రిగూడెంకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. హనుమంతు నాయక్ వివాహితుడు కాగా, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతిపై జిల్లా పోలీస్ శాఖ సంతాపం వ్యక్తం చేసింది.

Blogger ఆధారితం.