-->

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందికి కోర్టు జరిమానాలు

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందికి కోర్టు జరిమానాలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ కింద మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మంది వ్యక్తులకు జరిమానాలు విధించారు. ఈ తీర్పును స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు వెల్లడించారు.

కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌.ఐ. టి. రాకేష్ కథనం ప్రకారం, పోలీసులు తనిఖీ సమయంలో 13 మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు రుజువైంది. నిందితులను కోర్టులో హాజరుపర్చగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. మేజిస్ట్రేట్ వారికి జరిమానాలు విధించగా, వారు చెల్లించారు.

అలాగే, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌.ఐ. కె. నరేష్ కథనం ప్రకారం, మరో తొమ్మిది మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పరీక్షల్లో మద్యం సేవించినట్లు నిరూపితమవడంతో, కోర్టులో వారు నేరాన్ని ఒప్పుకుని జరిమానాలు చెల్లించారు.

ఇక, పాల్వంచ టౌన్ ఎస్‌.హెచ్‌.ఓ. ఐ. జీవన్ రాజ్ పర్యవేక్షణలో జరిగిన వాహన తనిఖీల్లో నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించినట్లు రుజువవడంతో, కోర్టులో విచారణ జరిగి జరిమానాలు విధించబడ్డాయి.

ప్రమాదాలకు కారణమవుతున్న మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.