-->

రూ. 41 లక్షల విలువైన గంజాయి పట్టివేత - భద్రాచలంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడి

రూ. 41 లక్షల విలువైన గంజాయి పట్టివేత - భద్రాచలంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడి

భద్రాచలం: తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం, గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారు‌ను తనిఖీ చేసిన అధికారులు, అందులో 75 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గంజాయి ఒడిశా నుండి రాజస్థాన్‌కి అక్రమంగా తరలిస్తున్నారు. గంజాయి సహా స్వాధీనం చేసుకున్న కారుతో కలిపి మొత్తం విలువను రూ. 41 లక్షలుగా అంచనా వేయబడింది.

ఈ కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన అనిల్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ దేవ్‌లను అరెస్టు చేయగా, పాల్వంచకు చెందిన దుర్గాప్రసాద్ గంజాయి సరఫరా చేశాడని విచారణలో నిందితులు వెల్లడించారు. దుర్గాప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేశారు.

పట్టుబడ్డ గంజాయి దాడి టీం సభ్యులు:

తిరుపతి (AES), రమేష్ (EI), కరీం (HC), బాలు (HC), సుధీర్ (EC), హరీష్ (EC), విజయ్ (EC), హనుమంతు (EC)

ఈ విజయవంతమైన దాడికి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఐపీఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా, డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ కూడా ఎన్ఫోర్స్మెంట్ టీంను అభినందించారు.

Blogger ఆధారితం.