కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీతాలక్ష్మి
రాయల వెంకట శేషగిరిరావు విగ్రహానికి ఘన నివాళులు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శ్రేణులతో కలిసి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై సమావేశం జరిగింది.
తర్వాత, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాయల వెంకట శేషగిరిరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, పూర్ణచందర్, నాగరాజు, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment