పోలీస్ స్టేషన్ నుంచి డోర్ కట్ చేసి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు
హన్మకొండలో సంచలనం: హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసు అధికారులు నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
తెల్లవారుజామున స్టేషన్‌లోని కంప్యూటర్ రూమ్ వద్ద ఉన్న డోర్‌ను కట్ చేసి ముగ్గురు నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. స్టేషన్ ఆవరణలో తాళం లేని పాత మోటార్ సైకిల్‌ను అక్కడికక్కడే స్టార్ట్ చేసి అజ్ఞాత దిశగా పరారయ్యారు. మరో వ్యక్తి మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.
ఘటన వెలుగులోకొచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం అన్ని దిశల్లో గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికారుల స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.

Post a Comment