-->

వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ సర్పంచ్ అభ్యర్థి బరిలో బొగ్గం మంజుల

వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ సర్పంచ్ అభ్యర్థి బరిలో బొగ్గం మంజుల


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా బొగ్గం మంజుల బరిలో నిలవడంతో ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అణగారిన వర్గాల ప్రజలలో ఆమెకు విశేష ఆదరణ లభిస్తోంది.

గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం బొగ్గం మంజుల ప్రధాన బలం. తన పదవిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా వనమానగర్ గృహనిర్వాసితుల సమస్యను పట్టుకొని, వారికి కొత్తగూడెం పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం పోరాడి, పరిష్కారం దిశగా కీలకమైన కృషి చేసిన నాయకురాలిగా మంజుల పేరు నిలిచింది.

ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన బొగ్గం మంజుల మాట్లాడుతూ “గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యమే నా లక్ష్యం. సమస్యలు దట్టంగా ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతతో తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాను. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివారావు ఆశీస్సులు నాకు పెద్ద బలం. సీపీఐ బలపరుస్తున్న అభ్యర్థిగా నిలవడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

తనకు కేటాయించిన ఎన్నికల గుర్తు ‘కత్తెర’ అని తెలిపారు. “వెంకటేష్ ఖని గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తాను” అని మంజుల భావోద్వేగంతో చెప్పారు.

గ్రామంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాలకు మహిళలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో తరలి రావడం ఈ ఎన్నికల హైలైట్‌గా మారింది. గ్రామంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుదల దిశగా ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793