లంచం కేసులో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్ – అనిశా దాడిలో పట్టుబాటు
రంగారెడ్డి జిల్లా – అధికార దుర్వినియోగంపై కఠిన చర్య రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారునిపై నమోదైన PDS రైస్ కేసును తొలగించడానికి, అలాగే అతనికి విధించిన జరిమానా ప్రక్రియలు పూర్తి చేసి రేషన్ షాప్‌ను తిరిగి తెరవడంలో సహాయం చేస్తానని చెబుతూ రూ.20,000/- లంచం డిమాండ్ చేసిన హనుమ రవీందర్ నాయక్, అందులోనుండి నగదు స్వీకరిస్తూ ఏసీబీకి అరెస్టయ్యారు.
అవినీతి చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం పౌరులకు భరోసా కలిగించేలా అనిశా వేగవంతంగా చర్యలు తీసుకుంది.
🚨 లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి – ప్రజలకు అనిశా విజ్ఞప్తి
ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే అనంతరం క్రింది మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:
📞 టోల్ ఫ్రీ నెంబర్
1064
📱 వాట్సాప్ నెంబర్
94404 46106
Telangana ACB
𝕏 (Twitter)
@TelanganaACB
🌐 వెబ్‌సైట్
acb.telangana.gov.in

Post a Comment