-->

పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవంలో కల్వకుంట్ల కవిత

పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత


పాల్వంచ: డిసెంబర్ 06: ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీకగా పేరుగాంచిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాకు శనివారం పాల్వంచలో ఘనంగా ప్రారంబోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,“ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా అత్యంత సాధారణ జీవితాన్ని గడిపిన మహానుభావుడు గుమ్మడి నర్సయ్య గారి వంటి నాయకుడు అరుదు. వారి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవకు అంకితభావం నేటి యువతకు ప్రేరణ. వారి గాథ సినిమాగా తయారవడం మన తెలంగాణకు మాత్రమే కాదు యావత్ భారతదేశానికి గర్వకారణం” అని పేర్కొన్నారు.

ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించి, ప్రేక్షకుల ఆదరణను పొందాలని ఆకాంక్షించిన కవిత, రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు నర్సయ్య గారి జీవితం ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ యూనిట్ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793