-->

ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్! డిసెంబర్ 13 లోక్ అదాలత్‌లో చెల్లించుకునే అవకాశం

ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్! డిసెంబర్ 13 లోక్ అదాలత్‌లో చెల్లించుకునే అవకాశం


హైదరాబాద్, డిసెంబర్ 03: వాహనంపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? రాయితీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం భారీ శుభవార్త. దేశవ్యాప్తంగా డిసెంబర్ 13న జరగబోయే లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్లపై 50% నుంచి 100% వరకు డిస్కౌంట్ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న పాత ఈ-చలాన్లను ఒక్కరోజులోనే సెటిల్ చేసుకోవచ్చు. చలాన్ చెల్లించిన వెంటనే ఆ కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది. తదుపరి కోర్టు విచారణ లేకుండా కేసు పూర్తిగా ముగిసినట్లే.

ఈ కార్యక్రమాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఈ ప్రత్యేక రాయితీ డ్రైవ్‌లో భాగమవుతోంది.


రాయితీకి అర్హత ఉన్న చలాన్లు:

చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన, ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు రాయితీతో సెటిల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా:

  • హెల్మెట్ లేకుండా డ్రైవింగ్
  • సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్
  • రెడ్ సిగ్నల్ జంప్
  • సాధారణ ఓవర్‌స్పీడింగ్
  • రాంగ్ పార్కింగ్
  • పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం
  • లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
  • నంబర్ ప్లేట్ లేకపోవడం
  • ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లోపాలు
  • సాంకేతిక కారణాలతో తప్పుగా నమోదైన చలాన్లు ఇవన్నీ లోక్ అదాలత్‌లో క్లియర్ చేసుకోవచ్చు.

డిస్కౌంట్ వర్తించని కేసులు:

ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులకు ఈ రాయితీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. అవి:

  • మద్యం సేవించి వాహనం నడపడం (Drunk & Drive)
  • హిట్ అండ్ రన్
  • ప్రమాదకర డ్రైవింగ్
  • గాయాలకు లేదా మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలు
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793