-->

ముగ్గురు బాలికలను బెదిరిస్తూ అత్యాచారం చేసిన ఇంటర్ విద్యార్థి

ముగ్గురు బాలికలను బెదిరిస్తూ అత్యాచారం చేసిన ఇంటర్ విద్యార్థి


నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఇంటర్ విద్యార్థి ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థి నాగర్‌కర్నూల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే సమయంలో తనతో చదువుతున్న పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలికలతో స్నేహం పెంచుకుని ప్రేమ పేరుతో వారిని వంచించాడు. అనంతరం వారిపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.

తరువాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని, వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ బాలికల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాళ్లలో ఒకరు ధైర్యం చేసి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించారు.

దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాధితుల్లో ఒక బాలిక గర్భం దాల్చగా, కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ నిర్వహించినందుకు సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో గురువారం ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793