-->

ఒకే చితిపై నవదంపతులకు అంతిమ వీడ్కోలు

 

ఒకే చితిపై నవదంపతులకు అంతిమ వీడ్కోలు

హైదరాబాద్: నగరంలో విషాదాన్ని మిగిల్చిన ఘటనలో బలవన్మరణానికి పాల్పడిన నవదంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్‌పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలో ఉన్న హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీరుమున్నీరుగా వీడ్కోలు పలికారు.

వివాహమై ఇంకా రెండు నెలలు కూడా గడవకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన ఈ దంపతులు, మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించడంతో ఇంట్లో విషాదం నెలకొంది.

ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతులకు ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

స్థానికుల సమాచారం ప్రకారం, ముందుగా మంజుల పురుగుల మందు తాగి మృతి చెందగా, అనంతరం కార్తీక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, అసలు కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793