-->

నవ లిమిటెడ్ సహకారంతో జోగారావు కాలువ ప్రారంభం

నవ లిమిటెడ్ సహకారంతో జోగారావు కాలువ ప్రారంభీంచిన ఎమ్మెల్యే కూనంనేని


పాల్వంచ : నవ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం భాగంగా నిర్మించిన జోగారావు కాలువను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై కాలువను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోగారావు కాలువ ద్వారా పరిసర ప్రాంతాల రైతు కుటుంబాలకు సాగునీటి సౌకర్యం మెరుగై అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కాలువను నిర్మించి వారికి అంకితం చేయడం నవ లిమిటెడ్ సంస్థ చేసిన గొప్ప సేవ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ భాగం రామారావు, డీజీఎం శ్రీకాంత్, సిఎస్ఆర్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ రావు, సివిల్ ఇంజనీర్ కరుణాకర్, షాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ ఎం గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ డి ప్రసాద్, కార్పొరేటర్లు, రైతులు మరియు సిఎస్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793