కొత్తగూడెం ఈద్గాను సందర్శించిన కమిటీ సభ్యులు, మేయార్ మూడు గణేష్
కొత్తగూడెం పట్టణంలోని ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే పెయింటింగ్ పనులు చేపట్టడం కోసం సోమవారం ఈద్గా వద్ద సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈద్గాను పట్టణ మేయర్ మూడు గణేష్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రమజాన్ సందర్భంగా ఈద్గా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతూ అవసరమైన మరమ్మతులు, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూగర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, మహమ్మద్ ఆబీద్ హుస్సేన్, మహమ్మద్ యూసుఫ్, యాకూబ్, షేక్ అబ్దుల్ కరీం, అమీర్ ఖాద్రి, ఫహీం దాదా, ఎస్కె అన్వర్ పాషా, ఖమర్, మొహమ్మద్ మెహబూబ్, బాబు జానీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment