పెళ్లి ఒత్తిడి… విధి నిర్వహణలోనే వైద్యురాలి ప్రాణాంతక నిర్ణయం
చంద్రరేఖ అనే యువ వైద్యురాలి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణాలు కాపాడాల్సిన ఆమె అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది.
లభించిన సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడంతో గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లి విషయంలో వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఆమె విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం చంద్రరేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం Palakollu Government Hospital కు తరలించారు.
ఆసుపత్రి ప్రాంగణంలో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి వైద్య సిబ్బంది సైతం ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. యువ వైద్యురాలి ఆకస్మిక మృతి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Post a Comment