-->

కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య కలకలం

కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య కలకలం


భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కవిత భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793