-->

టిప్పర్ లారీలో మంటలు.. చూస్తుండగానే లారీ దగ్ధం

 

టిప్పర్ లారీలో మంటలు.. చూస్తుండగానే లారీ దగ్ధం

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల కోసం గ్రామం వైపు వెళ్తున్న టిప్పర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో టిప్పర్ లారీ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793