5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 06: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ & మండల పంచాయితీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్‌కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుని భార్యకు చెందిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద నిర్మాణంలో ఉన్న ఇంటి తాజా ఫోటోలు తీసి, వాటిని హౌసింగ్ యాప్‌లో దశలవారీగా అప్‌లోడ్ చేసి రూ.1,40,000/- మంజూరు పొందేందుకు సహాయం చేస్తానని చెప్పి, ఇందుకోసం కార్యదర్శి రాజ్‌కుమార్ రూ.5,000/- లంచం కోరాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుని నుండి డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో ACB అధికారులు దాడి చేసి అతడిని రంగేహస్తంగా అరెస్ట్ చేశారు.
ACB అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అవినీతి ఎదురైతే ప్రజలు చేయాల్సిందేమిటి?
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చు:
- టోల్ ఫ్రీ నంబర్: 1064
- WhatsApp: 9440446106
- Facebook: Telangana ACB
- X (Twitter): @TelanganaACB
- Website: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment