గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లాప్
పాల్వంచ: పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే, సామాజిక న్యాయ యోధుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా షూటింగ్‌ను శనివారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తొలి క్లాప్ ఇచ్చి చిత్రీకరణను ప్రారంబించారు.
హెలిపాడ్ వద్దకు చేరుకున్న మంత్రిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఎంపీ ఆర్.ఆర్.ఆర్. తో కలిసి ఘనంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో
▪️ మాజి ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
▪️ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని
▪️ కన్నడ హీరో పునీత్ శివరాజ్ కుమార్ దంపతులు
▪️ నిర్మాత నల్లారి సురేష్ రెడ్డి
▪️ దర్శకుడు పరమేష్
▪️ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య
▪️ కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిన గుమ్మడి నర్సయ్య గారి పోరాట పంథాను, ప్రజాసేవను ఈ సినిమా ప్రతిబింబించనుందని చిత్రబృందం తెలిపింది.

Post a Comment