-->

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం


హైదరాబాద్ | డిసెంబర్ 09: తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ ప్రముఖుల బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వేంకట్ రెడ్డి, ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటీమణులు జెనీలియా, అక్కినేని అమలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


🔶 సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ ప్రగతికి కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


🔶 ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ

  • ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.
  • సినిమా రంగానికి కీలకమైన 24 క్రాఫ్ట్స్‌లో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలపై పరిశీలన చేయాలని సూచించారు.

🔶 స్టూడియోలకు ప్రభుత్వ ప్రోత్సాహం

ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి పరిశ్రమకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


🔶 'స్క్రిప్ట్‌తో వస్తే… సినిమా పూర్తి చేసుకుని వెళ్తారు'

సినీ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • స్క్రిప్ట్‌తో వచ్చేవారు… పూర్తి చేసి వెళ్తే ఎలాంటి క్లిష్టతలు లేకుండా ప్రభుత్వ సహాయాన్ని అందిస్తాం” అని సీఎం పేర్కొన్నారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793