-->

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల – తెలంగాణ విద్యాశాఖ ప్రకటన

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల – తెలంగాణ విద్యాశాఖ ప్రకటన


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈసారి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతీ రోజూ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్నాయని అధికారులు తెలిపారు.


విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు ప్రణాళిక కోసం ఈ షెడ్యూల్‌ను ప్రకటించినట్లు పేర్కొంది.
పరీక్షల పూర్తి తేదీలు, సబ్జెక్ట్ వారీ వివరాలు పై ఇచ్చిన ఫొటోలో అందుబాటులో ఉన్నాయి.

విద్యాశాఖ సూచనలు:

  • విద్యార్థులు హాల్‌టికెట్లు ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఎగ్జామ్ సెంటర్‌కు కనీసం 1 గంట ముందుగా చేరాలి.
  • పరీక్షకు అవసరమైన స్టేషనరీ తప్ప ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.

పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపింది తెలంగాణ విద్యాశాఖ.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793