-->

2026 నూతన సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల

2026 నూతన సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల


హైదరాబాద్ : డిసెంబర్ 09: 2025 సంవత్సరం ముగింపుకు చేరువలో ఉండగా, రాబోయే 2026 ఏడాదికి సెలవుల షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులు, వేతనంతో కూడిన సెలవులపై సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం, 2026 సంవత్సరానికి మొత్తం 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించగా, మరో 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా గుర్తించింది.

సాధారణ సెలవుల్లో సంక్రాంతి, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం కార్యాలయాలు మూసివేయబడతాయని స్పష్టం చేసింది.

రంజాన్, బక్రీద్ వంటి పండుగల తేదీలు చంద్రదర్శనం ఆధారంగా మారే అవకాశం ఉన్నందున మార్పులు ఉంటే ముందుగానే మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాగే ఐచ్ఛిక సెలవుల జాబితా నుంచి ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా ఐదు రోజులు తమ సౌకర్యానికి అనుగుణంగా ఎంపిక చేసుకుని సెలవులు వినియోగించుకోవచ్చని తెలిపింది.


2026 సంవత్సరం నెలవారీ సాధారణ సెలవులు

జనవరి

  • 14 (బుధవారం) – భోగి
  • 15 (గురువారం) – సంక్రాంతి / పొంగల్
  • 26 (సోమవారం) – గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి

  • 15 (ఆదివారం) – మహాశివరాత్రి

మార్చి

  • 3 (మంగళవారం) – హోలీ
  • 19 (గురువారం) – ఉగాది
  • 21 (శనివారం) – రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)
  • 22 (ఆదివారం) – రంజాన్ తరువాతి రోజు
  • 27 (శుక్రవారం) – శ్రీరామనవమి

ఏప్రిల్

  • 3 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
  • 5 (ఆదివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
  • 14 (మంగళవారం) – డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి

మే

  • 27 (బుధవారం) – బక్రీద్

జూన్

  • 26 (శుక్రవారం) – మొహర్రం

ఆగస్టు

  • 10 (సోమవారం) – బోనాలు
  • 15 (శనివారం) – స్వాతంత్ర్య దినోత్సవం
  • 26 (బుధవారం) – ఈద్ మిలాద్-ఉన్-నబీ

సెప్టెంబర్

  • 4 (శుక్రవారం) – శ్రీకృష్ణ అష్టమి
  • 14 (సోమవారం) – వినాయక చవితి

అక్టోబర్

  • 2 (శుక్రవారం) – మహాత్మా గాంధీ జయంతి
  • 18 (ఆదివారం) – సద్దుల బతుకమ్మ
  • 20 (మంగళవారం) – విజయదశమి
  • 21 (బుధవారం) – విజయదశమి తరువాతి రోజు

నవంబర్

  • 8 (ఆదివారం) – దీపావళి
  • 24 (మంగళవారం) – కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి

డిసెంబర్

  • 25 (శుక్రవారం) – క్రిస్మస్
  • 26 (శనివారం) – క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)

2026 ఐచ్ఛిక సెలవులు

జనవరి

  • 1 (గురువారం) – నూతన సంవత్సరం
  • 3 (శనివారం) – హజ్రత్ అలీ జన్మదినం
  • 16 (శుక్రవారం) – కనుమ
  • 17 (శనివారం) – షాబ్-ఎ-మెరాజ్
  • 23 (శుక్రవారం) – శ్రీపంచమి

ఫిబ్రవరి

  • 4 (బుధవారం) – షాబ్-ఎ-బరాత్

మార్చి

  • 31 – మహావీర్ జయంతి

మే

  • 1 – బుద్ధ పౌర్ణమి

నవంబర్

  • 8 – నరక చతుర్దశి

డిసెంబర్

  • 24 – క్రిస్మస్ ఈవ్
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793