తెలంగాణలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు
హైదరాబాద్, డిసెంబర్ 09: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధత వేగం పుంజుకుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాలుగా నియమించిన పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నారు.
ఎన్నికల పనులు, పోలింగ్ సామాగ్రి ఏర్పాటు, సిబ్బంది బస వంటి ఏర్పాట్ల దృష్ట్యా, ఆయా పాఠశాలలకు సుమారు ఆరు రోజులపాటు సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సెలవుల వివరాలు ఇలా…
- తొలి విడత పోలింగ్ దృష్ట్యా:డిసెంబర్ 10, 11 తేదీలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
- రెండో విడత సందర్భంలో:డిసెంబర్ 13 తేదీ రెండో శనివారం కావడంతో, 14 తేదీ ఆదివారం కావడంతో ఆ రోజులు కూడా సెలవులుగా ఉంటాయి.
- మూడో విడత పోలింగ్ నేపథ్యంలో:డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మూతపడి ఉంటాయి.
దీని వలన మొదటి విడతకుగాను సెలవులు లభించిన స్కూళ్లు, మూడో విడత పోలింగ్ కారణంగా కూడా అదనంగా రెండు రోజులు సెలవులు పొందుతాయి. మొత్తంగా పాఠశాలలు వరుస రోజులు మూసివేయబడుతున్నాయి.
ఉద్యోగులకు చెల్లింపు సెలవు
పోలింగ్ శాంతియుతంగా సాగేందుకు, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కూడా డిసెంబర్ 11న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వరుస సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వల్పకాలిక విశ్రాంతి పొందనున్నారు. ఎన్నికల అనంతరం పాఠశాలలు సాధారణ విధులు పునరుద్ధరించనున్నాయి.

Post a Comment