ఘోర బస్సు ప్రమాదం: పది మందికి పైగా మృతి
స్థానికుల సమాచారం ప్రకారం — చిత్తూరు జిల్లా విగ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన AP 39 UM 6543 నెంబరు గల ప్రైవేట్ బస్సు భద్రాచలం నుంచి 37 మంది ప్రయాణికులతో అరకు వైపు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మారేడుమిల్లి సమీపంలోని రాజు గారి మెట్టు వద్ద ఘాట్ రోడ్డులోని మలుపు దాటే క్రమంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడినవారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ప్రయాణికుల అరుపులతో ఒక్కసారిగా చెలరేగిన ఆందోళన వాతావరణం అందరినీ కదిలించింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ చర్యలను వేగవంతం చేశారు. కొండ ప్రాంతం, ఉదయం మంచు, ఘాట్ రోడ్డు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడినవారని తెలుస్తోంది.
అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Post a Comment