వేములవాడలో ఉద్రిక్తం: మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపై కత్తులతో దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా | డిసెంబర్ 12: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లెకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై శుక్రవారం తెల్లవారుజామున దుండగులు కత్తులతో దాడి చేయడం ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమంది రాజుపై దాడి చేసినట్లు సమాచారం.
పోలీసుల ప్రకారం, దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాజు తలకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆసుపత్రిని సందర్శించి రాజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
దాడికి పాల్పడింది నాగయ్యపల్లి గ్రామానికి చెందిన శివతో పాటు మరో వ్యక్తి అని రాజు పోలీసులకు తెలిపాడు. ఘటనపై వేములవాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment