-->

ప్రచారంలో దూసుకు పోతున్న భారత్ లేబర్ ప్రజా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అజ్మీర పావని

ప్రచారంలో దూసుకు పోతున్న భారత్ లేబర్ ప్రజా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అజ్మీర పావని

బసవతారక కాలనీ గ్రామపంచాయితీ: భారత్ లేబర్ ప్రజా పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా అజ్మీర పావని – ఓటర్లకు హామీల వర్షం

బసవతారక కాలనీ, డిసెంబర్ 12: బసవతారక కాలనీ గ్రామపంచాయితీలో సర్పంచ్ పదవికి భారత్ లేబర్ ప్రజా పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి అజ్మీర పావని పోటీచేస్తున్నారు. ఆమెకు కేటాయించిన ఉంగరం గుర్తుకే ఓటు వేచి గెలిపించాలని పార్టీ కార్యకర్తలు, అనుచరులు ప్రజలను కోరుతున్నారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పావని గారు ప్రజలకు పలు ముఖ్య హామీలు వెల్లడించారు.

అజ్మీర పావని ప్రకటించిన ముఖ్య హామీలు

🔹 ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్
గ్రామంలోని ప్రతి ఇంటికీ సోలార్ కరెంట్‌ అందుబాటులోకి తెచ్చి, శాశ్వత విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు.

🔹 ఇంటింటికి మినరల్ వాటర్
గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా ఇంటింటికీ మినరల్ వాటర్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

🔹 ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి ₹5,000 ప్రోత్సాహకం
ఆడపిల్ల పుట్టుకను ప్రోత్సహించేందుకు గ్రామపంచాయితీ తరఫున రూ.5,000 అందజేస్తామని చెప్పారు.

🔹 ఆడపిల్ల పెళ్లి సమయంలో ₹5,000 సహాయం
పేద కుటుంబాలకు అండగా నిలిచి, ఆడపిల్లల పెళ్లి సందర్భంగా రూ.5,000 ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.

🔹 క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం
గ్రామంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రత్యేకంగా క్రీడా స్థలాన్ని కేటాయించి, అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

🔹 గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
దేవాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని పూర్తి స్థాయి ఆధునిక గ్రామంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


వార్డు సంఖ్య: 3

SI No: 1

అభ్యర్థి పేరు: అజ్మీర పావని

గుర్తు: ఉంగరం

"ఉంగరం గుర్తుకే మన విలువైన ఓటు వేయండి" అని ప్రచార బృం దం విజ్ఞప్తి చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793