-->

పంచాయతీ పోరు… సర్పంచ్‌గా 82 ఏళ్ల వృద్ధురాలు విజయం

పంచాయతీ పోరు… సర్పంచ్‌గా 82 ఏళ్ల వృద్ధురాలు విజయం


డిసెంబర్ 11, 2025 | పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామం పంచాయతీ ఎన్నికల్లో విశేషం చోటుచేసుకుంది. 82 ఏళ్ల కాసిపేట వెంకటమ్మ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. వయసు పైబడినా ప్రజాసేవపై ఉన్న మక్కువతో పోటీ చేసిన వెంకటమ్మకు గ్రామస్తులు విశేష స్పందన చూపారు.

ఓట్ల లెక్కింపులో ముందంజలో నడిచిన వెంకటమ్మ చివరకు విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజలందరి సహకారం కోరుకుంటానని వెంకటమ్మ తెలిపారు.

తాజా పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, పలు గ్రామాల్లో అభ్యర్థులు విజయం సాధించి తమ అనుచరులతో కలసి సంబరాలు జరుపుకుంటున్నారు.

Blogger ఆధారితం.