తొలి విడత పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది.
ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం—
- కాంగ్రెస్: 662 స్థానాలు
- బీఆర్‌ఎస్: 259 స్థానాలు
- బీజీపీ: 51 స్థానాలు
- ఇతరులు: 152 స్థానాలు
వార్డు సభ్యుల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగింది.
- కాంగ్రెస్ వార్డు మెంబర్లు: 11,230
- బీఆర్‌ఎస్: 5,000
- బీజీపీ: 2,000
- ఇతరులు: 7,500
కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. విజయం సాధించిన ఇతర పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న స్థానిక సంస్థల రాజకీయ దిశపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment