-->

బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక

బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక

"సమాజంలో గౌరవప్రదంగా జీవించండి"  ట్రాన్స్‌జెండర్లకు హితవు

హైదరాబాద్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలను మానుకుని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని గౌరవప్రద జీవితం గడపాలని ట్రాన్స్‌జెండర్లకు ఆయన సూచించారు.

హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 250 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు. సీపీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ & మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ కూడా పాల్గొన్నారు.

సీపీ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ గ్రూపుల మధ్య తరచూ జరుగుతున్న తగాదాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాయని శుభకార్యాల పేరుతో ఇళ్లకు వెళ్లి బలవంతపు వసూళ్లు చేయడం అసహ్యం అని
ఇలాంటి చర్యలు చేసిన వారిపై ఎవరైనా అయినా కఠిన చర్యలు తప్పవని నేర కేసులు భవిష్యత్తు నాశనం చేస్తాయని హెచ్చరించారు.

ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలో సమగ్ర పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

'ప్రైడ్ ప్లేస్' ద్వారా సమస్యల పరిష్కారం – ఏడీజీ చారు సిన్హా

ట్రాన్స్‌జెండర్ల కోసం మహిళా భద్రత విభాగంలో ప్రత్యేక వింగ్ ‘ప్రైడ్ ప్లేస్’ ఏర్పాటు చేశామని అదనపు డీజీపీ చారు సిన్హా తెలిపారు. వేధింపులు లేదా సమస్యలు ఎదురైతే నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని చెప్పారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని ఆమె సూచించారు.

తెలంగాణలో 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు – జిల్లా అదనపు డైరెక్టర్ రాజేందర్

ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే ప్రతి ట్రాన్స్‌జెండర్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డ్ తప్పనిసరిగా తీసుకోవాలని రాజేందర్ సూచించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అధికారుల హాజరు

ఈ సమావేశంలో జాయింట్ సీఎస్‌పీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇకుబాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రతా డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793