-->

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి ఐదు సర్పంచ్‌ స్థానాలు బోణీ

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి  ఐదు సర్పంచ్‌ స్థానాలు బోణీ


తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి విజయం ఘనంగా నమోదైంది. జాగృతి ఆధ్వర్యంలో బలపరిచిన ఐదుగురు సర్పంచ్‌ అభ్యర్థులు విజయపతాకాలు ఎగురవేశారు.

నిజామాబాద్‌ జిల్లా పలు మండలాల్లో జాగృతి తన ప్రభావాన్ని ఆవిష్కరించింది. రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామంలో జాగృతి మద్దతుతో పోటీ చేసిన శంకర్ ఘన విజయం సాధించారు. బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామంలో చంద్ విజయం సాధించగా, రెంజల్ మండలం విరన్న గుట్టతండా సర్పంచ్‌గా సుమలత జాదవ్ గెలుపొందారు.

నవీపేట మండలం రాంపూర్ గ్రామంలో జాగృతి మద్దతుతో పోటీ చేసిన కమలాకర్ ఆధిక్యంలో నిలిచారు. రెంజల్ గ్రామ సర్పంచ్‌గా తిరుపతి లలిత హన్మాండ్లు విజయం సాధించడం జాగృతి నాయకులకు ఆనందాన్ని కలిగించింది.

తొలి దశలోనే ఐదు సర్పంచ్‌ స్థానాలను గెలుచుకోవడం తెలంగాణ జాగృతి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగాలని జాగృతి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793