మాతృదినోత్సవ శుభాకాంక్షలు "అమ్మ – ప్రేమ, త్యాగం, పరమార్థం"
గర్భం నుండి భూగర్భం మీదకు తీసుకొచ్చి, లోకాన్ని పరిచయం చేస్తుంది అమ్మ..!
అమ్మ ప్రేమను నిర్వచించలేము. కన్ను తెరిచిన క్షణం నుంచి చివరి దుప్పటి కప్పుకునే వరకు, బంధం కోసం, కుటుంబం కోసం, అహర్నిశలు శ్రమిస్తూ – తన ఇంటిని నందనవనం చేస్తుంది అమ్మ.
నీడలా వెన్నంటే ఉండి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవిలా –
ఆమె బిడ్డలను విజ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. గురువులా మారి, సమాజ నిర్మాణానికి అవసరమైన విలువలను బోధిస్తుంది. బాధ్యత గల పౌరులుగా ఎదిగేలా చేస్తుంది.
తొలి అడుగునుంచి తానై నడిపిస్తూ –
మన జీవితానికి పునాదులు వేస్తూ, మార్గదర్శిగా మారుతుంది అమ్మ. మన లోపాలను ప్రేమతో చూపిస్తూ, సరిదిద్దే మంత్రిగా మారుతుంది అమ్మ.
పచ్చని చెట్ల మధ్య గంతులు వేసే జింకపిల్లలా పెంపకం –
ఆమె పెంపకంలో స్వేచ్ఛ, ప్రేమ, అర్థం అన్ని ఉంటాయి.
తరతరాల చరిత్రకు సాక్ష్యం అమ్మ –
అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. జీవం లేదు. అసలు సృష్టే లేదు.
ఈ నాటి మాతృదినోత్సవం సందర్భంగా, కంటిపాపలా కాపాడే ప్రతి అమ్మకూ శతకోటుల వందనాలు
శుభాకాంక్షలతో:
మంజుల పత్తిపాటి
కవయిత్రి,
మాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
చరవాణి: 93470 42218
Post a Comment