సామూహిక వివాహాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో గురువారం పలు శుభకార్యాలు జరగగా, వీటిలో ముఖ్యంగా పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పలువురు నూతన దంపతులను ఆశీర్వదించారు.
లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో జరిగిన "శ్రీ వాల్మీకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ భూదేవి ఉభయ నాంచారుల" ఆలయ తిరుకళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేదపండితులు నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సవంలో పాతిక జంటలు ఒకటయ్యాయి. వీరిని కాపు సీతాలక్ష్మి ప్రత్యేకంగా ఆశీర్వదించగా, ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు శాలువాతో సత్కారం చేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నూతన దంపతులకు వివాహ ధృవీకరణ పత్రాలను కూడా ఆమె అందించారు.
కొత్తగూడెం టౌన్‌కు చెందిన దామెర ఓమేష్-లలితా దంపతుల కుమార్తె పావని వివాహ వేడుకకు హాజరైన కాపు సీతాలక్ష్మి, వధువుకు పట్టు వస్త్రాలు అందజేసి, ఆశీర్వచనాలు తెలిపారు. తర్వాత, కొత్తగూడెం కేసిఓఏ క్లబ్‌లో జరిగిన ఏకు రాయమల్లు-సుమభాను దంపతుల కుమారుడు చరిత్ రాజ్, దుర్గా అనితల వివాహ వేడుకలో పాల్గొని, వారికి ఆశీర్వాదాలు అందించారు.
పాల్వంచ తెలంగాణ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మరో వివాహ వేడుకలో భట్టు మురళి-మంజుల దంపతుల కుమార్తె విజయలక్ష్మి, వినయ్ దంపతులను ఆశీర్వదించారు. ఈ శుభకార్యక్రమాలలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూడ్ జయరాం, మైనారిటీ సెల్ నాయకుడు ఖాజా భక్ష్, పూర్ణచందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment