-->

ఉపాధి హామీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉపాధి హామీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పని చేస్తున్న సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేసింది. మొత్తం రూ.62 కోట్లు విడుదల చేసి, నాలుగు నెలలుగా బకాయి వేతనాల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఊరట కలిగించింది.

ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న సుమారు 3,200 మందికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు లాంటి సిబ్బంది జీతాలు చెల్లించబడ్డాయి.

గత కొన్ని రోజులుగా జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సిబ్బంది నిరసనల్లో పాల్గొంటున్నారు. వారి ఆందోళనపై ప్రభుత్వం స్పందించి నేడు బకాయి వేతనాలను విడుదల చేసింది.

తాజా అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను పరిశిలించండి

Blogger ఆధారితం.