-->

సోషల్ మీడియా వేదికలపై అసత్య ప్రచారంపై కేంద్రం సీరియస్

సోషల్ మీడియా వేదికలపై అసత్య ప్రచారంపై కేంద్రం సీరియస్


న్యూ ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

సోషల్ మీడియా వేదికలపై దేశీయంగా లేదా విదేశాల నుంచి నకిలీ ఖాతాల ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను తక్షణమే గుర్తించాలని సూచించింది. ఈ అసత్య ప్రచారాలను గుర్తించిన వెంటనే సంబంధిత ఖాతాలను కేంద్ర సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బ్లాక్ చేయాలని ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యలు దేశ భద్రతా పరంగా కీలకంగా మారనున్నాయని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.