జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ బాలల రక్ష భవన్‌ను ఆకస్మిక తనిఖీ
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ బాలల రక్ష భవన్‌ను సందర్శించారు
కొత్తగూడెం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ శుక్రవారం కొత్తగూడెంలో ఉన్న బాలల రక్ష భవన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. తన పర్యటనలో భవన్‌లోని సదుపాయాలు, నిర్వహణ, పిల్లల సంక్షేమం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి నిర్వహకులను పలుకరించి, పిల్లల రక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. ఎం. రాజేందర్ పర్యటన పట్ల సిబ్బంది సహకరించగా, ఈ తనిఖీ బాలల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
Post a Comment