-->

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం


బెజవాడ, ప్రఖ్యాత శక్తిపీఠం ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అద్భుతంగా అలంకరించారు. భక్తులకు ఆకర్షణగా నిలిచే విధంగా అమ్మవారికి సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు.

ఈ శాకాంబరీ ఉత్సవాలు జూలై 10వ తేదీన ముగియనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

దుర్గగుడిలో శాకాంబరీ ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారు ఈ కాలంలో శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని విశ్వాసం.

Blogger ఆధారితం.