వన మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సంకల్పబద్ధంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్ పరిధిలో రుద్రాక్ష మొక్కను నాటి, పచ్చని తెలంగాణ కోసం మొక్కల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించి, పర్యావరణ హితంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. "తెలంగాణకు పచ్చని చీర కప్పేందుకు మనందరం కలసి కృషి చేయాలి" అంటూ పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి నడుపుతున్న సంకల్పాన్ని స్పష్టం చేశారు.
Post a Comment