భారీ వర్షాలు.. స్కూళ్లకు కొనసాగుతున్న సెలవులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనల మేరకు మంగళవారం కూడా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు ఒకరోజు సెలవు ప్రకటించారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వర్షాల ప్రభావంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో “అవసరమైతే స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ఇవ్వొచ్చు” అని సూచించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం కలెక్టర్లు వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో మన్యం జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.

Post a Comment