-->

పెద్దపల్లి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య?

పెద్దపల్లి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య?


పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అనిల్ అనే కానిస్టేబుల్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటన జరిగిన వెంటనే సహచరులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి స్వగ్రామం కరీంనగర్ జిల్లా కాగా, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Blogger ఆధారితం.