గాజులరాజం బస్తీలో CPI నాయకులకు ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాజుల రాజం బస్తీ (25వ వార్డ్) కమ్యూనిటీ హాల్‌లో అహలే సున్నతుల్ జమాత్ (ASJ) కమిటీ ఆధ్వర్యంలో CPI జిల్లా పార్టీ కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన స్కె. సాబీర్ పాషా గారికి, పట్టణ సమితి 3 టౌన్ ఏరియా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోహమ్మద్ యూసుఫ్ గారికి ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ASJ ప్రెసిడెంట్ కరీం గారు, వైస్ చైర్మన్ గౌస్ మోహియుద్దీన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ షమ్మీ గారు, యాఖూబ్ ఖాద్రి, అలీమోద్దీన్, మౌలానా, షఫీ, ఉస్మాన్, అబ్దుల్ రెహ్మాన్, నదీమ్, మసూద్, అన్వార్ ఖాన్, వహీద్ పాషా, తాజుద్దీన్ తదితరులు, ASJ కమిటీ సభ్యులు, బస్తీ పెద్దలు పాల్గొన్నారు.
మోహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ, “స్థానిక ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు గారికి మైనారిటీలపై అపారమైన అభిమానముంది. పేదల ఇంటి పెద్ద బిడ్డగా ప్రతిపని చేసి పెడతారు” అని ప్రశంసించారు. సాబీర్ పాషా మాట్లాడుతూ, “వారి ఆధ్వర్యంలో ప్రతి పనిని పూర్తి సమర్పణతో చేస్తాను” అన్నారు. CPI పార్టీలో వీరి నాయకత్వం బలమైన స్థానం సంపాదించిందని, ఎర్రజెండా ఎంత బలంగా ఉంటే సమాజానికి అంత మంచిదని వ్యాఖ్యానించారు..
Post a Comment